పొడుపుకథ - మార్గ పద్ధతి*

*పొడుపుకథ - మార్గ పద్ధతి* 
⚡⚡⚡⚡⚡⚡⚡⚡🌷
సంస్కృత సాహిత్యంలోని ఛందస్సుల్ని అనుసరించిన తెలుగు పొడుపు పద్యాలు, సంస్కృతాన్ని అనుసరించి తెలుగులో నిర్మాణమైన వృత్తఛందస్సును అనుసరించిన పద్యాలు ఈ కోవలోకి వస్తాయి. తెలుగు పొడుపు పద్యం సంస్కృతాన్ని అనుసరించినా తెలుగు వృత్త ఛందస్సును అనుసరించినా మార్గయే ఆపుతుంది.



చం: *మనసిజు మామ మామ యభిమాన మడంచిన వాని మామ నం* 

*దనుని విరోధి నందనుని నందను సుందరి మేనమామ జం* 

*పిన జగజెట్టి పట్టి పొడి జేసిన శూరుని తండ్రి గన్ను గన్*

*గొనిన సురాధి నాథుని తనూభవు నాయువు మీకు నయ్యెడున్ !*

మనసిజుడు మన్మథుడు. మన్మథుని మామ చంద్రుడు. చంద్రునిమామ దక్షుడు. దక్షుని అభిమానాన్ని అణచినవాడు ఈశ్వరుడు. ఈశ్వరుని మామ హిమవంతుడు. హిమమవంతుని కొడుకు మైనాకుడు. మైనాకుని విరోధి ఇంద్రుడు. ఇంద్రుని కొడుకు అర్జునుడు. అర్జునుని కొడుకు అభిమన్యుడు. అభిమన్యుని భార్య ఉత్తర. ఉత్తర మేనమామ కీచకుడు. కీచకుని చంపినవాడు భీముడు భీముని కొడుకు ఘటోత్కచుడు. ఘటోతుచుని చంపినవాడు కర్ణుడు. కర్ణుని తండ్రి సూర్యుడు. సూర్యుని కన్ను గొన్న వాడు విష్ణువు. విష్ణువు కొడుకు బ్రహ్మ. ఆ బ్రహ్మ ఆయుస్సు మీకూ కలుగాలని ఆశీర్వాదం.

ఈ పద్యం చంపకమాల వృత్తం. సంస్కృతాన్ని అనుసరించిన తెలుగు పద్యం. యతిప్రాసలతో తెలుగుదనాన్ని నింపుకొన్న పద్యం. కాబట్టి పొడుపు కథ మార్గ సాహిత్యాన్ని కూడా అనుసరించిందని చెప్పాలి.
🪵🪵🪵🪵🪵🪵🪵🪵🪵🪵

Post a Comment

0 Comments